Kadiyam Srihari and Kadiyam Kavya join Congress: BREAKING: కాంగ్రెస్ లో చేరారు కడియం శ్రీహరి, కడియం కావ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు బీఆరెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య.

ఈ సందర్భంగా కండువాకప్పి పార్టీలోకి బీఆరెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్యలను ఆహ్వానించారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ. తన కూతురు భవిష్యత్తు కొరకై బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ ఉంది.ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు పిటిషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే పలువురు నేతలు స్పీకర్ను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు.