కాంగ్రెస్ నేతలతో సమావేశమైన కడియం శ్రీహరి, కావ్య

-

Kadyam Srihari : కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు కడియం శ్రీహరి, కడియం కావ్య. కాసేపటి క్రితమే.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్సి, ఏఐసీసీ సెక్రటరీలు, టీపీసీసీ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై కాంగ్రెస్ నేతలతో చర్చించారు కడియం శ్రీహరి, కడియం కావ్య.

Kadyam Srihari and Kavya met with Congress leaders

ఇది ఇలా ఉండగా, BRS అధినేత కేసిఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖ లో తెలిపిన కడియం కావ్య….బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న కావ్య…ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని వెల్లడించారు. కెసిఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు కడియం కావ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version