కాకతీయ కళాతోరణం రాచరికం కాదు.. మా ఓరుగల్లు రాజసం : బీజేపీ నేతలు

-

వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ లోని కాకతీయ కళాతోరణం వద్ద ఇవాళ నిరసన చేపట్టారు. తెలంగాణ చిహ్నం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ కళాతోరణం తొలగించాలనే ఆలోచన చేయడం దుర్మార్గమని సీనియర్ నాయకులు గంటా రవి కుమార్ పేర్కొన్నారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు విద్యార్థులు, నిరుద్యోగులవి, రైతుల సమస్యలు గాలికి వదిలేసి తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగించాలని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూతన రాజముద్రను ప్రవేశపెట్టడం ఆపివేయాలని లేదంటే ప్రజాగ్రహం కి గురి కావడం జరుగుతుందని అన్నారు. బీజేపీ జిల్లా శాఖ తరపున ఉద్యమానికి సైతం సిద్ధంగా ఉన్నామన్నారు. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుని దీన్ని నిలిపి వేయాలన్నారు. లేదంటే రేపు ప్రజలు సామాజిక ఉద్యమకారులు చేసే ధర్నాలకు అనుమతి ఇవ్వాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాకతీయ కళాతోరణాన్ని తొలగించే నూతన రాజకీయానికి తెర లేపితే ప్రజాగ్రహం తో పాటు, బీజేపీ పార్టీ సైతం ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. కాకతీయ కళా తోరణం అంటే ఓరుగల్లు ప్రజల పౌరుషానికి ప్రతీక, అస్తిత్వానికి చిరునామా, కాకతీయ కళా తోరణంలో రాజసం ఉంది తప్ప రాచరికం లేదు. కాకతీయుల కళా తోరణంలో సాంస్కృతిక కళా సంపద, ప్రాచీన ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని, కాకతీయుల పాలనలో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం, జలకళ, శిల్పకళ, నృత్యకళ, నాగరికత, పాడి పంటలు, పశుసంపద, పచ్చని మాగాణి ఇలా అన్ని కళా రంగాలకు పుట్టినిలుగా విరాజీళ్ళుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version