కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ అరెస్ట్ అయ్యాడు. హరిరామ్‌పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. గజ్వేల్‌లో భారీగా చట్టవిరుద్ధమైన ఆస్తుల గుర్తించారు.

ENC హరిరామ్, అతని బంధువుల ఇళ్లల్లో 13 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ నేతలు రైతులకు ఉపయోగపడుతుందని పేర్కొంటుంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం కేసీఆర్ కుటుంబం కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని పేర్కొంటున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం దోచుకుందని తెలిపారు.