కాలేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు హాజరయ్యారు మాజీ ENC మురళీధర్ రావు, మాజీ CE CDO నరేందర్ రెడ్డి. అయితే డిజైన్స్ డ్రాయింగ్స్ అనుమతి విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదు అని నరేందర్ ను ప్రశ్నించింది కమిషన్. అప్పటి ప్రభుత్వ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఉన్నతాధికారులు ఒత్తిడి వల్ల గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చింది అని కమిషన్ ముందు ఒప్పుకున్నారు నరేందర్ రెడ్డి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చర్చల్లో నేను ఎక్కడా పాల్గొనలేదు నన్ను ఎవరూ పిలవలేదు అన్నారు.
అలాగే డిజైన్స్ అప్రూవల్ అంశంలో మాపై ఒత్తిడి ఉన్నది అందుకే హడావిడిగా అన్ని డిజైన్స్ పై అప్రూవల్ చేశాము. నిర్మాణం జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్ తప్పిదాలు జరిగాయి. ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగినట్లు నేను అనుకుంటున్నాను. వర్షా కాలానికి ముందు పాటించాల్సిన నిబంధనలు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న అధికారులు, కాంట్రాక్టు సంస్థ పాటించలేదు. పై అధికారుల ఒత్తిడి ప్రభుత్వం, ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయలేదు. బ్యారేజీల గేట్ల ఆపరేషన్ అధికారులు, కాంట్రాక్టు సంస్థ సరిగ్గా చేయలేదు. TSERL ఇచ్చిన మార్గదర్శకాలను కాంట్రాక్టు సంస్థ పాటించలేదు అని కమిషన్ కు తెలియజేసారు నరేందర్ రెడ్డి.