తెలంగాణ గ్రూపు 2 షెడ్యూల్ విడుదల

-

తెలంగాణలో గ్రూపు 2 పరీక్ష తేదీలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఆగస్టు నెలలోనే జరగాల్సి ఉండగా.. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు ధర్నాలు చేయడంతో ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి నోటిఫికేషన్ విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ పరీక్షలు నిర్వహించడానికి మాత్రం ఆలస్యం అయిందనే చెప్పాలి.

తాజాగా గ్రూపు 2 పరీక్షల షెడ్యూల్ ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 15, 16 తేదీలలో పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 15న పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనుంది. అలాగే పేపర్ 2 హిస్టరీ, పాలిటి, సోషియాలజీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు  జరుగుతుంది. డిసెంబర్ 16న పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 4 తెలంగాణ ఉద్యమం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. ఈ తేదీలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్తులు సన్నద్దం కావాలి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version