కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సుప్రీం కోర్టులో కల్వకుంట్ల కవిత కేసు విచారణ జరుగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను సుప్రీం కోర్టులో సవాలు చేశారు కల్వకుంట్ల కవిత.
తనపై ఎలాంటి చర్యలు ఈడి తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీం కోర్టును కోరారు కల్వకుంట్ల కవిత. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు కల్వకుంట్ల కవిత. ఇక ఇవాళ ఈడీ విచారణ పై గతంలో ఉన్న అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, సుమిత్ రాయ్ కేసులతో కలిపి విచారణ చేయనుంది సుప్రీం కోర్టు ధర్మాసనం. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిటల్ ఈ కేసు విచారణ జరపనున్నారు.