TTD : తిరుమలలో భక్తులు పొటెత్తారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఏకంగా 22 కంపార్టుమెంట్లలో తిరుమల శ్రీవారి భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
ఈ తరుణంలోనే… నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 45,825 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే..నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 21, 380 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లుగా నమోదు అయింది.
ఇక ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రథసప్తమి వేడుకలలో భాగంగానే….ఇవాళ ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు ఉండనున్నాయి.2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవ ఉండనుంది. రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.