తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోసారి స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఫోన్ ట్యాపింగ్‌పై అరెస్టులు, రిమాండ్‌లు అన్నీ జరిగాయని.. తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అనేక అంశాలపై సిట్‌లు వేయడం.. మూసివేయడం.. సాధారణంగా మారిందని మండిపడ్డారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
“ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చడంలో కరీంనగర్ మంత్రి హస్తం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు చెప్పారు. రాధాకిషన్‌రావు ఏం చెప్పారో పోలీసు రికార్డులో ఉంది. పెద్దలు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌లో నేను, రేవంత్‌రెడ్డి కూడా బాధితులమే.” అని బండి సంజయ్ అన్నారు.