హైడ్రా లాగా మేము “కోబ్రా” తీసుకు వస్తామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి. ఇవాళ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకు వచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకు రాడానికి కోబ్రా అని తీసుకువస్తామని పేర్కొన్నారు బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి.

కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే హైవే రోడ్డు మీద పడ్డ మందు లారీ లెక్క అయిందని పేర్కొన్నారు. ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకొని పోదాం అనే తప్ప పార్టీని బతికిద్దాం అని ఎవరికి లేదన్నారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఇలా వీళ్ళ ఇల్లు కాపాడుతున్నారని ఆగ్రహించారు.