తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు బిగ్ అలెర్ట్. TGSRTCలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. డ్రైవర్లు సహా వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ రానున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లదించారు.

కొత్త బస్సుల కొనుగోలు అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉందని సమాచారం అందుతోంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ కొంత ఆలస్యం కానుంది. కానీ, TGSRTCలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. TGSRTCలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తన్నారు.