బీఆర్ఎస్​ పార్టీలో చేరిన కత్తి కార్తీక

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో చేరికలపైనా దృష్టి సారిస్తున్నారు. కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ కేడర్​ను మరింత బలపరుచుకుంటున్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కాస్త ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలో అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ.. నియోజకవర్గాల్లో వారి ఓటు బ్యాంక్​ను తమవైపు తిప్పుకుంటోంది.

ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ భవన్​లో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు సమక్షంలో చేరికలు జరిగాయి. పలు పార్టీల నుంచి గులాబీ పార్టీలో నేతలు చేరారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కత్తి కార్తీక హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. దుబ్బాక అభివృద్ధే ధ్యేయంగా గులాబీ కండువా కప్పుకున్నట్లు ఆమె తెలిపారు. మరోవైపు ఆమెను పార్టీలోకి ఆహ్వానించిన హరీశ్ రావు మాట్లాడుతూ.. కత్తి కార్తీక బీఆర్ఎస్​లో చేరడం శుభ పరిణామం అన్నారు. పార్టీ ఆమెకు సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news