బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కి అలవాటు పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే కౌశిక్ రెడ్డికి నార్కోటిక్ టెస్టులు నిర్వహించాలని అన్నారు.
కౌశిక్ రెడ్డి వ్యూహాత్మకంగానే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చీరలు, గాజులు పంపడం కాదు.. ముందు ఆయన కట్టుకుని తిరగాలని అన్నారు. కాగా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ విషయంలో ప్రాంతీయ వివాదం తలెత్తింది.
ఆంధ్రా వాళ్లు దాడి చేస్తే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటామా అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ఉన్న వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతుంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాయిని రాజేందర్ కౌశిక్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.