సోనియమ్మకు సెల్యూట్..కానీ మోడీ మాట తప్పారు – కవిత

-

ఈడీ నోటీసులపై స్పందించిన కవిత..సోనియాపై ప్రశంసలు కురిపించింది. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోడీ మాటిచ్చారని.. కానీ ఆ మాటను తప్పారని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్సీ కవిత.

కానీ సోనియా.. ఈ బిల్లును రాజ్యసభలో పెట్టారని.. ఆమె సెల్యూట్‌ కొట్టారు. 9న నన్ను విచారణకు రమ్మన్నారని… కానీ 11న వస్తానని చెప్పానన్నారు. ఈడీ విచారణను ఎదుర్కొంటా, ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తా, నాకు భయమెందుకు? అని స్పష్టం చేశారు.

 

నేనేం తప్పు చేయలేదు, విపక్షాల మాట కూడా వినాలి, నాతోపాటు ఎవర్ని విచారించినా ఇబ్బంది లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. 27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోంది.. రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చిన సోనియాకు సెల్యూట్.. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్‌లో పడేశారని ఆగ్రహించారు. రేపు జంతర్‌మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నామని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version