ఇంటికి వచ్చాక కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత..!

-

కవిత నిన్న బెయిల్ పైన విడుదల అయిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి జీతాలు నుండి బయటకు వచ్చిన కవిత.. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్కడి నుండి తన ఇంటికి వచ్చిన కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అనంతరం సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు. తన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్న కవిత.. తన తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

అయితే చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందని విన్నాం చూశాం. అది భారతదేశములోనైనా తెలంగాణ లోనైనా. ఇప్పుడు నా విషయంలో కూడా న్యాయం గెలుస్తుంది.. ధర్మం గెలుస్తుంది.. అదే జరుగుతుంది. న్యాయం గెలుస్తది నిజం నిలబడుతుంది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటాను. ఈ అపవాదులను తట్టుకొని కడిగిన ముత్యంలా వస్తాను నాకు విశ్వాసం ఉంది అని కవిత కామెంట్స్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version