తెలుగు సాహిత్యానికి సినారె విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారు: సీఎం

-

తెలుగు సాహిత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాహితీ యోధుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కొనియాడారు. నేడు కవి, సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణ రెడ్డి.. 92 వ జయంతి సందర్భంగా తెలుగు సాహిత్య పరిపుష్టికి ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తన పాండిత్య ప్రతిభతో సినారే…. జ్ఞానపీఠ అవార్డును అందుకొని తెలుగు భాష వైభవాన్ని జగద్వితం చేసారని కొనియాడారు.

తెలుగు భాషా సాహిత్యంలో పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, సంగీత నృత్య రూపకాలు, గజళ్ళు ఇలా ప్రతిప్రక్రియలో తనపాండిత్యాన్ని నిరూపించుకున్న విలక్షణ కవి సినారె అని కేసీఆర్ పేర్కొన్నారు. కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీ గేయ రచయితగా, పరిపాలనాధ్యక్షుడిగా…. అలా ప్రతి రంగంలోనూ రాణించిన  బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె అని అని కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ భాషల్లోకి అనువాదమైన సినారె రచనలే ఆయన ప్రతిభకు గీటురాయి అనిఅన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం… తెలంగాణ కవులు, సాహితీవేత్తలకు తగిన రీతిలో చేయూతనిస్తూ, వారిని ప్రోత్సహిస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version