కెసిఆర్, కేటీఆర్ లను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరమాలి: రేవంత్ రెడ్డి

-

సీఎం కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు అక్కంపేట లో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న కేటీఆర్ ఏం అభివృద్ధి చేశారో.. చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొడంగల్ అభివృద్ధి జరిగింది అన్నారు. ఈ ప్రాంతానికి రైలు మార్గం రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా పేదలకు మేలు జరగలేదని.. తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం ఒకటేనని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసే రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అని అన్నారు. అందుకే రైతు డిక్లరేషన్ చేశామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్వింటాల్ ధాన్యాన్ని 2,500 రూపాయలకు కొంటామని అన్నారు. బ్యాంకులకు రుణపడి ఉన్న రైతులు ఒక్కరూపాయి చెల్లించవద్దని, పన్నెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది అని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యమన్నారు రేవంత్. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా ఉనికే లేకుండా చేశారని మండిపడ్డారు. కెసిఆర్, కేటీఆర్ లను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version