అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా కల్పించారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కేసీఆర్. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు.

ప్రియాంకను ఇప్పటికే ఎంబీబిఎస్ చదివించారు కేసీఆర్. ఎంబిబిఎస్ పూర్తిచేసుకుని పీజీ చేస్తున్న డా. ప్రియాంక చదువుకు కావలసిన ఆర్థిక సాయాన్ని నేడు కిష్టయ్య భార్యా పిల్లలకు అందించారు కేసీఆర్. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని భరోసా ఇచ్చారు కేసీఆర్.