కేసీఆర్ రైతుబంధుగా నిలిచారు.. రేవంత్ రాబంధు అయ్యారు : కేటీఆర్

-

కేసీఆర్ రైతుబంధుగా నిలిచారు.. రేవంత్ రాబంధు అయ్యారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.  వీళ్ల ద్రోహానికి డిక్షనరీలో కొత్త పదాలు వెతకాలి. ఎన్నికల్లో చెప్పకపోయినా రైతుబంధు అమలు చేశాం. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోంది.

15వేలు అని చెప్పి 12వేలు ఇస్తామంటున్నారు. కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఎన్నికల కోసం ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ఆర్తిక పరిస్థితి బాగలేదని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా..? రాష్ట్రాన్ని నడిపే తెలివి లేదు. చక్కదిద్దాల్సిన సీట్ లో కూర్చొని.. ఆర్థిక పరిస్తితి బాలేదంటున్నారు. పనికిమాలిన పనులు చేస్తూ జైలులో కూర్చొబెట్టడానికా..? మిమ్మల్ని ప్రజలు కూర్చొబెట్టింది అని ప్రశ్నించారు. రైతులను, మహిళలను మోసం చేయడానికే దివాళా కోరు మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతో రూ.15వేలు ఇస్తామని చెప్పించారు కాంగ్రెస్ నేతలు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version