కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్ర విమర్శలు చేశారు. చలో వరంగల్ సభ కోసం గోడల మీద బీఆర్ఎస్ లీడర్లు వరంగల్ సభ కోసం రాయిస్తున్న ప్రకటనలను ప్రభుత్వం చెరిపేయడంపై ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా బాల్కసుమన్ మీడియాతో మాడ్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. గోడల మీద కేసీఆర్ గారి పేరును చెరిపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చెరిపేయగలదా? అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి..అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి.. ప్రజలకు సంక్షేమాన్ని అందించి… ప్రజల గుండెల్లో నిలిచిన కేసీఆర్ గారిని చెరిపెయగలరా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.