BREAKING : నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

-

తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై కీలక అప్డేట్ వచ్చింది. నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు యశోద వైద్యులు.

KCR discharged from hospital today

ఇక కేసీఆర్ డిశ్చార్జ్ ఐన వెంటనే హైదరాబాద్ నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్లనున్నారు కేసీఆర్‌. ఈ మేరకు కేటీఆర్ అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలి తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్​లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయణ్ను పరామర్శించడానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నూతన మంత్రులు కేసీఆర్​ను పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version