దివ్యాంగులకు గుడ్ న్యూస్..రూ.4016 పెన్షన్లు పంపిణీ చేసిన కేసీఆర్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మెదక్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఎస్సీ కార్యాలయం,  సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు.  కేసీఆర్ తో పాటు మంత్రి హరీశ్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేసీఆర్  దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు రూ.4016 పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు. మెదక్ జిల్లాలో టీకె దార్ పెన్షన్లు పంపిణీ చేశారు కేసీఆర్.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాలను చూస్తే దారుణంగా ఉన్నాయని.. వాటిని ఇప్పుడు తిరిగి నిర్మించుకోవడం వల్ల ప్రజలకు ఒకే దగ్గరికి అన్నీ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో లేదో వాళ్లకు కనబడటం లేదని ప్రతిపక్షాలపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

 గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా నాటి చేతగాని పాలకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.200 ఉన్న ఆసరా పింఛన్‌లను ఇప్పుడు రూ.4000 తీసుకొచ్చామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version