కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు శాసన సభ వేదిక గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం 8వ ప్రపంచ వింత అని పెయిడ్ ప్రచారం చేయించారు.
ఆ ప్రాజెక్టు కు కేసీఆరే ఇంజినీర్. లూజ్ సాయిల్, లూజ్ ఫౌండేషన్ మీద కాళేశ్వరాన్ని నిర్మించడం పెద్ద తప్పు అన్నారు. ఈ ప్రాజెక్టు కి సంబంధించి కేసీఆర్, హరీశ్ రావు ను క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి శీల పరీక్షను నిరూపించుకోవాలని పాల్వాయి హరీశ్ వ్యాఖ్యానించారు.