నార్త్ ప్రజలు జనాభా పెంచి దేశాన్ని కాపాడుతున్నారు : చంద్రబాబు

-

భారత్‌కు ఉన్న గొప్ప వరం జనాభా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్య ఎదుర్కొంటున్నాయని, మనదేశానికి మరో 40 ఏళ్ల వరకు అలాంటి సమస్య రాదని తెలిపారు. అయితే దక్షిణ భారతంలో చాలా మంది సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పారు. కానీ ఉత్తర భారతీయులు ముఖ్యంగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్ వాళ్లు జనాభా పెంచి భారతదేశాన్ని కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025లో ముఖ్యఅతిథిగా పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు.

అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం అమెరికన్‌ ఇండియన్లదే. అమెరికాలోని ఖరీదైన ప్రాంతాల్లోకి వెళ్లి తెలుగు, తమిళంలో పిలిస్తే చాలామంది పోగవుతారు. భారతీయులు ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా అడ్జెట్ అవ్వగలుగుతారు. 2047 సంవత్సరం నాటికి భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్‌ అవుతారు. ఇండియన్స్ టెక్నాలజీని తొందగా అందిపుచ్చుకుంటారు. రాగల రోజుల్లో అమరావతిని క్యాంటమ్‌ వ్యాలీగా నిలబెడతాం. నూతన ఆవిష్కరణల సృష్టికర్తలు నేటి యువతరమే. అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news