బజరంగ్ దళ్ ను నిషేధించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ పై కీలక ఆరోపణలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నేడు హైదరాబాద్ లోని నాగోల్ లో జరిగిన ఓబీసీ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అండతో కేసీఆర్ బజరంగ్దళ్ ని నిషేధించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ ఏ వర్గాన్ని వ్యతిరేకించదని చెప్పారు బండి సంజయ్. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. ఏ ముస్లిం వ్యక్తి కూడా బజరంగ్దళ్ ను నిషేధించాలని కోరుకోవడం లేదన్నారు.

తెలంగాణలో నయా నిజాంలా మారిన కేసీఆర్ కు గోరి కట్టే రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. జూన్ నెలలో లక్ష మందితో బీసీ గర్జన నిర్వహిస్తామని వెల్లడించారు. కేసీఆర్ బీసీల ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఈ విషయంలో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version