కొత్త సచివాలయంలో కేబినెట్ భేటీ… చర్చలో కీలక విషయాలు..!

-

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇంకాసేపట్లో కొత్తగా నిర్మించిన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. కాగా ఈ సచివాలయంలో జరగనున్న మొదటి కేబినెట్ కావడంతో ఎటువంటి నిర్ణయాలు తీయూసుకుంటారనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ భేటీలో చర్చకు రానున్న ముఖ్య విషయాలలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల గురించి ఎక్కువ సమయం చర్చించే అవకాశం ఉంది. ఇక గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చ మరియు వాటిని ఆమోద పరచడానికి ఏమైనా సవరణలు చేయాలన్నది నిర్ణయం తీసుకోవచ్చు, పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం, గృహలక్ష్మి పధకం మార్గదర్శకాలు, అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభోత్సవం లాంటి వాటిపై చర్చలు మరియు వీటిపైన నిర్ణయాలు తీసుకుంటారు.

అయితే ఇవి కాకుండా అనధికారికంగా రాష్ట్రంలోని సమస్యలు, ప్రతిపక్షాల వ్యూహాలపై చర్చలు ఎలాగు ఉంటాయి. ఇది కాకుండా రానున్న ఎన్నికల గురించి కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version