మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ ఫైనల్ చేశారు. నాగర్‌కర్నూల్ సీటుపై ముఖ్యలతో చర్చించిన తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. అంతకుముందు కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్నవారిని మళ్లీ చేర్చుకోవద్దని నేతలు కేసీఆర్‌తో అనగా.. పార్టీ వదిలి వెళ్తున్నవారిని మళ్లీ తీసుకునే ప్రసక్తి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
“రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోంది. వంద రోజులు పూర్తికాకముందే వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్ నేతలు అలవిగాని హామీలిచ్చి ఆశలు రేకెత్తించారు. హామీల అమలుపై నాలిక మడతపెట్టి తిట్లకు దిగుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు డబ్బులు లేవని చెప్పడం సరికాదు. పాలమూరుకు ఎంతో చేశాం, అక్కడ ఓడిపోవాల్సింది కాద. పాలమూరు – రంగారెడ్డి కాల్వలు పూర్తి చేసి నీరివ్వాలి. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల అనాలోచిత చర్య. దుష్ప్రచారాలు నమ్మి ఓట్లేసినవారికి వాస్తవాలు తెలుస్తున్నాయి.” అని కేసీఆర్ అన్నారు.