తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పది: కేసీఆర్‌

-

తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర చాలా గొప్పదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఎన్జీవో సంఘం కొనసాగిందని తెలిపారు. ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్‌ భావించారు. బతుకమ్మ సినిమా తీద్దామని కథ కూడా రాశానని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు.

“ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాళ్లను సీఎం కానీయలేదు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణవాళ్లే సీఎంలు అయ్యారు. తెలంగాణవాడు సీఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు.. 1999లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఉద్యమం ప్రారంభించగానే పదవులు, పైసలు కోసం మెుదలుపెట్టారనే ప్రచారం చేసేవారు. ఉద్యమం కోసం ఎవరైనా పైసలు అడిగితే నాకు ఫోన్‌ చేయాలని చెప్పాను. ఆఫీసుకు జాగా ఇచ్చారని కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసం కూలగొట్టారు. ఆఫీసు కోసం తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తికి జాగా దొరకని పరిస్థితి.” అని కేసీఆర్ ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version