తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజీనామా లేఖను రాజ్ భవన్ లో గవర్నర్ కి సమర్పించారు. తెలంగాణలో మూడో సారి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేసేంత మెజార్టీ లేకపోవడంతో తాను సీఎం పదవీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కి రాజీనామాను అందజేశారు కేసీఆర్.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తమిళి సై కొనసాగమంటే ఏం చెబుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా నెలకొంది. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవం పై దేశ నలుమూలల నుంచి జనాలు వస్తున్నారు. భారీ బందో బస్తు ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ని కలిసే అవకాశముంది. రేపు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలలో ఎవరో ఒకరూ ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.