కేసీఆర్ సభ ఎఫెక్ట్.. వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ.. !

-

గులాబీ పార్టీకి భారీ ఊరట లభించింది. కెసిఆర్ సభ నేపథ్యంలో తాజాగా వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. హనుమకొండలో గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ సభపై విచారణ… ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే సభ అనుమతి పై ఈనెల 17వ తేదీన నిర్ణయం వెల్లడించాలని ప్రభుత్వ లాయర్ కు హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఇచ్చింది. ఈనెల 27వ తేదీన హనుమకొండలోని ఎల్కతుర్తి ప్రాంతంలో గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ సభ జరగనుంది.

kcr

ఈ సభలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసంగం ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు. ఇందులో భాగంగానే సభ నిర్వహించి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు కేసీఆర్. దీనికోసం ఎల్కతుర్తి లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలోనే వరంగల్ జిల్లాలో.. సభలు అలాగే ఊరేగింపులు, ప్రచారాలు నెలరోజులపాటు నిర్వహించకూడదని వరంగల్ పోలీసులు విధించారు. ఈ తరుణంలోనే హైకోర్టును ఆశ్రయించింది గులాబీ పార్టీ. దీనిపై విచారణ చేసిన హైకోర్టు వరంగల్ పోలీసులకు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ కేసు పై విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news