టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో 100 కు పైగా గోవులు మృతి చెందాయని బాంబు పేల్చారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఈ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టారని ఫైర్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన వాళ్లంతా ఏమయ్యారు? అంటూ నిలదీశారు.

మా హయాంలో దాదాపు 550 ఆవులను దాతల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చామన్నారు. ఆ ఆవులు ఇచ్చే 15 వేల లీటర్ల పాలతో నిత్యం వేంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదం కోసం వాడామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఇతర గోవుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.