అంగన్‌వాడీ చిన్నారులకు కేసీఆర్ సర్కార్‌ శుభవార్త..ఇక వారికి స్నాక్స్‌ కూడా !

-

అంగన్‌వాడీ చిన్నారులకు కేసీఆర్ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఇక వారికి స్నాక్స్‌ కూడా ఇచ్చేందుకు రంగం సిద్దం చేసింది సర్కార్‌. అంగన్‌వాడీ చిన్నారులకు కేసీఆర్ సర్కార్‌ అంగన్ వాడిలోని చిన్నారులకు అత్యంత మెరుగైన పౌష్టిక విలువలు ఉన్న చిరుతలళ్లు అందించేందుకు తెలంగాణ ఫుడ్స్ విభాగ రంగం సిద్ధం చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు చిరుతిళ్లు అందిస్తున్నప్పటికీ సరికొత్త సాంకేతికతతో ఈ ఆహారాన్ని తయారుచేసి అందించనుంది. దీనికోసం తెలంగాణ ఫుడ్స్ విభాగం ప్రత్యేకంగా అత్యాధునిక స్నాక్ ఫుడ్ యూనిట్ ను స్థాపించింది. నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 42.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ లో ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఈ కేంద్రాన్ని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రారంభించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version