నా ఎత్తును తగ్గించడం అంత ఈజీ కాదు.. కేసీఆర్ సెటైర్

-

కాంగ్రెస్‌, బీజేపీది రాజకీయ వికృత క్రీడ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ .. తనను తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారని తెలిపారు. తాను పెరగాల్సిన ఎత్తు పెరిగానని. తనను తగ్గించడమనేది ఉండదని ఇది కాంగ్రెస్‌, బీజేపీ చిలిపి రాజకీయ క్రీడ అని ఆయన సెటైర్ వేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

అజ్ఞానం, అహంకారపూరితంగా కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి శాసనసభలో అన్నారు. ఆ ఆలోచన ఎంతటి వికృతమైంది. కాంగ్రెస్‌ పార్టీ 10 ఏళ్లు అధికారంలో లేదు. ఆ పార్టీ పోయిందా?  ఎవరి టైమ్‌ కోసం వాళ్లు వెయిట్‌ చేస్తుంటారు. కచ్చితంగా వాళ్ల టర్న్‌ వస్తుంది. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు. వాళ్ల ఆలోచన సరళి మారుతుంది. కృతిమ్రంగా చేసే ఆరోపణలు, ఇటువంటి ప్రయత్నాలు బెడిసికొడతాయి. ఇలాంటివి ఎప్పుడు చరిత్రలో సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు కూడా కావు.  – కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత

Read more RELATED
Recommended to you

Latest news