తెలివి ఉండాలి.. సిగ్గులేని రాజకీయాలు.. కేసీఆర్ ఫైర్‌

-

కేబినేట్ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణా సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, ప్రధానంగా కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని, కాంగ్రెస్ కి ఏ అంశం ఎత్తుకోవాలో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్ళకు ఎప్పుడు ఏది మాట్లాడాలో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేసారు.

తెలివి ఉండాలని సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చత్తీస్ఘడ్ లో కాంగ్రెస్ హామీ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదు మద్దతు ధర ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు న్యాయం చేసే అంశంలో చర్చకు తాను సిద్దంగా ఉన్నా అని ఆయన స్పష్టం చేసారు. రైతులకు లేని కంగారు కాంగ్రెస్ నేతలకు ఉందని, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రంలో కూడా రైతులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.

అనవసరంగా ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ నేతలు అభాసు పాలు కావోద్దని కేసీఆర్ హితవు పలికారు. ఇప్పటికి అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ప్రజలు నవ్వుతారని కేసీఆర్ ఎద్దేవా చేసారు. తెలంగాణాలో నాటు సారాను పూర్తిగా అరికట్టాం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు అని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసారు. నిజమైన రైతులు ఎవరూ పంటను తగలబెట్టుకోదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news