కెసిఆర్ VRO వ్యవస్థను రద్దు చేసి గ్రూప్ 4 ఉద్యోగాల్లో వాళ్లని భర్తీ చేయాలని చూస్తున్నారు – వైయస్ షర్మిల

-

కెసిఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి గ్రూప్ 4 ఉద్యోగాల్లో వాళ్ళని భర్తీ చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. లక్ష 91 వేల ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం లెక్క తప్పినా వదిలిపెట్టమంటూ హెచ్చరించారు. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు.

” లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నా 8 ఏండ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా,కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు,కమిటీల పేరిట కాలయాపన చేసి,లక్ష ఉద్యోగాలకు ఎసరుపెట్టి చివరికి 80 వేల ఉద్యోగ ఖాళీలే అని తేల్చిన దొర గారు, మరో 10 వేల ఉద్యోగాలను మింగేస్తున్నాడు.ధరణి పేరిట భూములు దోచుకోవడానికి VROలు అడ్డుగా ఉన్నారని VRO వ్యవస్థను రద్దు చేసిన KCR గారు, ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాల్లో వాళ్ళను భర్తీ చేయాలని చూస్తున్నారు. లక్షా 91 వేల ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం లెక్క తప్పినా వదిలిపెట్టం.మీరు ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగుల పక్షానా YSR తెలంగాణ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. “. అని వైయస్ షర్మిల ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version