కేసీఆర్ కౌశిక్ రెడ్డిని అదుపులో పెట్టుకో అని పీసీసీ చీఫ్ మహేష్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కొంపల్లి దేవర యంజాల్ లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ప్రజలు అంగీకరించనున్నారు. ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే పై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు.
దాడులు, దురుసు ప్రవర్తన తెలంగాణ సంస్కృతి కాదని.. కేసీఆర్, కేటీఆర్ అదుపుచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు క్రమశిక్షణ అవసరం అని.. ఇకనైనా కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు. ఈ రకమైన ప్రవర్తనతో రాజకీయంగా ఎదుగుతామనుకోవడం అవివేకమేనని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రవర్తన ఎవ్వరూ చేసిన ఉపేక్షించొద్దన్నారు.