పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్టార్ లోని తాండా అర్టిలరీ బ్రిగేడ్ లో 9వ సాయుధ దళాల మాజీ సైనికులు దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఓకే లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమన్నారు. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన కృషిని రాజ్ నాథ్ సింగ్ మంగళవారం ప్రశంసించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ, కాశ్మీర్ లను సమానం చూస్తుందని చెప్పారు.
గత ప్రభుత్వాలు కాశ్మీర్ ను భిన్నంగా చూశాయి. ఫలితంగా ఈ ప్రాంతంలోని మన సోదరులు, సోదరీమణులను దేశంతో కలపలేకపోయారు. మా ప్రభుత్వం కాశ్మీర్ దేశంలోని మిగతా ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోందన్నారు. ఈ దిశగా సరైన చర్యలు తీసుకున్న సీఎం ఒమర్ అబ్దుల్లా అని ప్రశంసించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వరుల్ దేశానికి భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు.