తల్లిదండ్రులు పిల్లల విషయంలో.. ఈ 5 తప్పులు చేయకూడదు..!

-

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు కొన్నిటిని పక్కా ఫాలో అవ్వాలి. ఇలా చేయడం వలన పిల్లలు మంచిదారిలో వెళ్తారు, తల్లితండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లల్ని ప్రోత్సహించినట్లయితే కొత్త విషయాలని నేర్చుకుంటారు. అలాగే గెలవడానికి కూడా పిల్లలు ట్రై చేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళే నేర్చుకుంటారులే అని వదిలేస్తారు. కానీ ప్రోత్సాహం చాలా ముఖ్యం అలాగే పోషకాహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. పిల్లలకి పోషకాహారాన్ని పెట్టడం వలన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. యాక్టివ్ గా ఉంటారు. పిల్లలకి హైజిన్ నేర్పించాలి. కచ్చితంగా శుభ్రతని అలవాటు చేయాలి. పైగా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు.

చాలామంది ఈరోజుల్లో ప్రీస్కూల్, డే కేర్ వంటి వాటిలో చేర్పిస్తున్నారు. పిల్లలకి అన్ని విలువలు మీరు నేర్పించడం మర్చిపోకండి. వీటితో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ చాలా అవసరం. పిల్లల్ని ఎప్పుడూ కూడా ఆటలాడడానికి ప్రోత్సహించాలి. దగ్గర్లో పార్కులు వంటివి ఉంటే కూడా తీసుకువెళ్లండి. స్క్రీన్ టైంకి మాత్రం పిల్లలకి దూరంగా ఉంచాలి. రెండు గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్ల ముందు గడపకూడదు. ఈ విషయాన్ని పక్కా ఫాలో అవ్వండి.

పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తే ఖచ్చితంగా పిల్లలు చదవడం అలవాటు చేసుకుంటారు ఆ తర్వాత వాళ్లే చదివేసుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలి. వాళ్లని ఆదర్శంగా తీసుకుని పిల్లలు ముందుకు వెళ్లేటట్టు తల్లిదండ్రులు ఉండాలి. అప్పుడు పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు పైగా జీవితంలో పైకి వస్తారు. పిల్లలు బాగా చదువుతారు కదా అని వదిలేయొద్దు. పిల్లలు ఎలా చదువుతున్నారనేది మీరు చూడాలి. స్కూల్ ఫంక్షన్ కి వెళ్లడం మీటింగ్లకు వెళ్లడం హోంవర్క్ చూడడం దగ్గర్లో ఉన్న లైబ్రరీ ఇటువంటి వాటికి తీసుకెళ్లడం ఇలా పిల్లల్ని తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version