తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 15వ తేదీ లోపు అకౌంట్లోకి డబ్బులు కూడా రాబోతున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో… ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఊపందుకుంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తొలి విడతలో 71, 482 ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. దాదాపు 700 మంది నిర్మాణం కూడా ప్రారంభించారని లెక్కలు చెబుతున్నాయి.

ఇక ఈ వారంలో మెజారిటీ లబ్ధిదారులు కూడా మొదలుపెట్టబోతున్నారట. బేస్మెంట్ పూర్తయిన వారి అకౌంట్లో మొదటగా.. ఈనెల 15వ తేదీ నాటికి డబ్బులు వేయబోతున్నారట. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు లక్ష రూపాయల చొప్పున జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకోసం 715 కోట్లు సిద్ధం చేసిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే విడుదలవారీగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయ్యేసరికి లబ్ధిదారునికి ఐదు లక్షలు ఇవ్వనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.