తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీలకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం లేదని పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. ఈనెల 28 నుంచి ఆరవ తేదీ వరకు పాలేరు నియోజకవర్గంలో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అయితే కొందరు ఆరు గ్యారెంటీలకు కుల ఆదాయ సర్టిఫికెట్ కూడా అవసరమని మీసేవ, తహసిల్దార్ కార్యాలయాల్లో చుట్టూ తిరుగుతున్నారని అవి అసలు అవసరం లేదని తేల్చి చెప్పారు.
అదేవిధంగా గ్యారంటీల దరఖాస్తులు బయట తీసుకోరాదని కూడా సూచించారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ పేరును మార్చడం సవరణలు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు మంత్రి పొంగులేటి. ఆధారు రేషన్ కార్డు జిరాక్స్ మాత్రమే దరఖాస్తుతో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుకు ఆధార్ రేషన్ కార్డు తప్ప మిగతావి ఏవి సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. అయితే గ్యాస్ కు సంబంధించి దరఖాస్తులు గ్యాస్ బుక్కు కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని.. అదేవిధంగా చేయూత పింఛనుదారులు అప్లికేషన్ లో ఉన్న విధంగా అప్లికేషన్ను పూర్తీ చేయాలని సూచించారు. రూ. 2,500 కోసం కొత్త కోడళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆధార్ కార్డు మార్చకున్నా వారి పేరు నమోదు చేసుకోవచ్చని సూచించారు.