BREAKING: సుప్రీం కోర్టులో కేసీఆర్ వేసిన పిటీషన్ నేపథ్యంలో..రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. కేసీఆర్ పిటిషన్ పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ కీలక వాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పట్టింది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. అలాగే.. దీనిపై చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారు ? కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ? మరొక జడ్జిని నియమించండని రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు.
న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా కనపడాలని…పేర్కొన్నారు. దీంతో తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో మంతనాలు చేస్తున్నారు. కలెక్టర్ల సమావేశం నుంచి ముఖ్యమంత్రి గదిలోకి వెళ్లిపోయిన సీఎం రేవంత్… సుప్రీంకోర్టులో విద్యుత్ కమిషన్ చైర్మన్ జాన్ నర్సింహరెడ్డిని మార్చి కొత్త జడ్జిని నియమించాలన్న ధర్మాసనం నిర్ణయంపై చర్చిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కొత్త జడ్జి పేరు చెప్పాలని ఆదేశించడంతో అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు చేస్తున్నారు. సీనియర్ జడ్జిల పేర్లు సూచించారట అడ్వకేట్ జనరల్. కాసేపట్లో కొత్త జడ్జి పేరును ప్రకటించనున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.