కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల

-

తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(URS) రాత పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి.  1,241 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడులైనట్లు అధికారులు తెలిపారు. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ సిబ్బందిని ఎంపిక చేసేందుకు జులైలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ర్యాంకు కార్డులను పొందవచ్చని అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉండగా.. ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో 42 స్పెషల్‌ ఆఫీసర్, 849 పీజీ సీఆర్‌టీ, 273 సీఆర్‌టీ, 77 పీఈటీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు జూన్‌ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. రాత పరీక్షలో, టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ ర్యాంకులను విడుదల చేశారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసి తుది జాబితాను విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news