నేడే ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం..!

-

కరోనా మహమ్మారి వల్ల నిరాడంబరంగా సాగిన వినాయక నవరాత్రులు ఇవాళ నిమజ్జనంతో ముగియనున్నాయి. నిమర్జనం కోసం పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఇవాళ మధ్యాహ్నం 3 గం.కు ప్రారంభమై టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్‌ నెం.4 దగ్గర నిమర్జనం కానుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణెష్‌ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం కూడా నిర్వహించడం లేదని ఇప్పటికే నిర్వాహకులు స్పష్టం చేశారు.  అలాగే మంగళవారం నాడు నగరంలో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు.

ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని సీపీ కోరారు. సోమవారం ట్యాంక్ బండ్ వద్ద మంగళవారం జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 15వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని.. ప్రధాన కూడళ్ల వద్ద డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అలాగే ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న 50వేల సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తామని సీపీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version