తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాయికి మించి వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గురించి మాట్లాడారు, యోగి వేసుకున్న బట్టల గురించి అయన లుంగి గురించి మాట్లాడుతున్నారు. యోగికి, మోడికి కుటుంబ రాజకీయాలు లేవని గుర్తుచేశారు. డిల్లీ వెల్లిన ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు….కుటుంబ పెత్తనం చేయకుండా ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకోసం జీవిస్తున్నారు, ప్రజలకోసం పరిపాలిస్తున్నారు.
కానీ మీరు మీ కుటుంబ వారసత్వం కోసం, అవినీతి కోసం, అక్రమాలకోసం, అహంకారం కోసం పరిపాలిస్తున్నారు. సంవత్సరం తరువాత మీ పార్టీ ఉండదు కాబట్టి ఈ సంవత్సరం అయినా వరదలపై దృష్టి పెట్టండని మోడిని భారతీయ జనతా పార్టీని విమర్శించడం మానెయ్యండి. నిరాశ, నిస్పృహలతో ఎం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్దం కానీ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు పడనున్న నేపద్రంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి బాద్యతారహితంగా వరదలను వదిలిపెట్టి పదవుల కోసం మాట్లాతున్నాడు. కుటుంబ పాలన తెలంగాణ ప్రజలపై ఉందా లేదా? మా వంశ పర్యాపరంగా పాలన కొనసాగుతుందా. మా పీఠాలు కదులుతున్నయ్ అనే దౌర్భాగ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరింస్తున్నారని అన్నారు.
రెండు గంటలు తిట్టడం కాదు రెండు సంవత్సరాలు తిట్టిన తెలంగాణ ప్రజలు మీ కుటుంబ పాలన పెత్తనాని, అదిపత్యాని వదిలించుకుంటారని అన్నారు. ఎవరు వద్దన్నా,కాదన్నా కెసిఆర్ కుటుంబాని, కల్వకుంట్ల కుటుంబాని ఒవైసి కుటుంబాని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సహించరని తెలిపారు. తెలంగాణలో 1200 మంది అమరవీరులు కల్వకుంట్ల కుటుంబం కోసం బలికాలేదని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. కెసిఆర్ తెలంగాణాలో ఏదో పొడిచాము, ఉద్ధరించాము, తెలంగాణాను చూసి నేర్చుకొండి తెలంగాణాలో అన్ని మేమే చేశాము, మా వళ్ళనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజలకు అక్షర జ్ఞానం లేదు, మేమే ఫాంహౌస్ లో పంటలు పండించి వచ్చిన డబ్బుతో తెలంగాణాను ఉద్దరించామనే విధంగా మాట్లాడుతున్నారు.