ఎడిట్ నోట్: బాబు బూమరాంగ్.!

-

అధికారంలోకి రావడానికి టి‌డి‌పి అధినేత చంద్రబాబు మామూలు కష్టాలు పడటం లేదు. ఈ వయసు లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి బాబు పడే కష్టం పగవాడికి కూడా రాకూడదనే చెప్పాలి. పాపం ఎంత కష్టపడితే ఏం లాభం..బాబుకు అన్నీ ఎదురే అవుతున్నాయి. ఏది కలిసి రావట్లేదు. పార్టీకి ప్లస్ అవ్వడం లేదు. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి జగన్ పై బాబు పోరాటం చేస్తూనే ఉన్నారు.

కానీ ఎక్కడ కూడా ఈ పోరాటాలు సఫలం కావడం లేదు. బాబుకు కలిసి రావడం లేదు. పైగా టి‌డి‌పి నేతలు సహకారం కూడా అంతంత మాత్రమే. కొందరు పార్టీ కోసం హార్డ్ వర్క్ చేయడం లేదు. ఇక నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఇది అంతగా వర్కౌట్ అవ్వడం లేదు. పార్టీకి కలిసి రావడం లేదు. సరే ఏదేమైనా గాని బాబు మాత్రం పట్టు వదలకుండా పోరాడుతూనే ఉన్నారు. ఓ వైపు జగన్ పై పోరాడుతూనే..ప్రజలని ఆకర్షించడానికి పలు హామీలు ఇస్తున్నారు. అటు వైసీపీ నేతలని టార్గెట్ చేసి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు.

టి‌డి‌పి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం కోసం అనునిత్యం కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఏది కూడా కలిసిరావడం లేదు. అదే సమయంలో ఇటీవల కొన్ని సంఘటనల్లో టి‌డి‌పి నేతలు, కార్యకర్తలపై కేసులు, జైలుకు వెళ్ళడం..ఇవన్నీ టి‌డి‌పి శ్రేణుల్లో దూకుడు తగ్గింది.

ఇక ఇప్పుడు బాబుకు ఏకంగా ఐటీ నోటీసులు రావడం..దీనిపై వైసీపీ దూకుడుగా ముందుకెళుతుండటంతో టి‌డి‌పిలో నైరాశ్యం కనిపిస్తోంది. ఈ పరిణామాలు అన్నీ బాబుకు మైనస్ అవుతున్నాయి. అటు జగన్ పై బాబు అనేక విమర్శలు చేస్తున్నారు. అయినా సరే ప్రజల నుంచి స్పందన రావడం లేదు. బూమరాంగ్ అవుతున్నాయి. మొత్తానికి బాబు కష్టానికి ప్రతిఫలం వచ్చేలా లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version