బూర నర్సయ్య విజ్ఞప్తి మేరకు భువనగిరి కోటను ఆధునీకరిస్తాం – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

బూర నర్సయ్య విజ్ఞప్తి మేరకు భువనగిరి కోటను ఆధునీకరిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. సర్వాయి పాపన్న గౌడ్ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.. గౌరవించిందని.. పోస్టల్ శాఖ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల చేసిందని వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మొగులుల రాచరిక పాలనకు వ్యతిరేకంగా బడుగుల కోసం సర్వాయి పాపన్న పోరాటం చేశారని.. సర్వాయి పాపన్న చరిత్ర మరుగున పెట్టారని తెలిపారు.

75 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించిందని..భావి తరాలకు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర తెలవాల్సిన అవసరం ఉందని వివరించారు. గోల్కొండ కోట ఎలివేషన్ కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించాం… బూర నర్సయ్య విజ్ఞప్తి మేరకు భువనగిరి కోటను ఆధునీకరిస్తామని ప్రకటన చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీ స్మరించుకునే కార్యక్రమం మరో రెండు రోజుల్లో నిర్వహిస్తామన్నారు. బహుజన హితయా… బహుజన సుఖయా.. అన్నా నినాదాన్ని కుటుంబ హితయా.. కుటుంబ సుఖయా.. అన్నట్లుగా కేసీఆర్ మార్చారని ఆగ్రహించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version