హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా గెలుస్తాం – కిషన్‌ రెడ్డి

-

హైదరాబాద్ ఎంపీ స్థానం కూడా గెలుస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. స్వయంగా డ్రైవ్ చేస్తూ ప్రచార రథాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ…పార్టీ జండా నాయకత్వంలోనే యాత్ర ఉంటుందని..పార్టీ నేతలు ఈ యాత్రల్లో పాల్గొంటారని తెలిపారు. మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా యాత్ర లు అన్నారు.

kishan reddy on lok sabhakishan reddy on lok sabha 

భాగ్యలక్ష్మి ఆలయం ఉన్న హైదారాబాద్ స్థానం కూడా కైవసం చేసుకునే విధంగా ముందుకి వెళ్తామని ప్రకటించారు. అభ్యుదయ భావాలు ఉన్న ముస్లిం సమాజం మోడీ కి మద్దతు ఇస్తున్నారు…17 పార్లమెంట్ సీట్లు లక్ష్యమన్నారు. మోడీ నాయకత్వానికి ఆశిస్సులు అందించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నామని చెప్పారు. రోడ్ షో లకు ప్రాధాన్యత….ప్రజల మధ్యన తిరుగుతామని వివరించారు. 17 సీట్లలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version