Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోంగార్డులకు షాక్ తగిలిందని వార్తలు వస్తున్నాయి. కారుణ్య నియామకాలపై వెనక్కి తగ్గిందట రేవంత్ సర్కార్. చనిపోయిన హోంగార్డుల స్థానంలో వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకాలపై యూటర్న్ తీసుకుందని అంటున్నారు.
తెలంగాణలో కారుణ్య నియామకాలను భర్తీ చేసేది లేదంటూ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. హోంగార్డుల కుటుంబ సభ్యులకు నియామకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించిందట హోంశాఖ. ఎన్నికల సమయంలో కారుణ్య నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చి రేవంత్ మోసం చేశారని హోంగార్డు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ సర్కార్ మరో మోసం!
చనిపోయిన హోంగార్డుల స్థానంలో వారి కుటుంబీకులకు ఇచ్చే కారుణ్య నియామకాలపై యూటర్న్
తెలంగాణలో కారుణ్య నియామకాలను భర్తీ చేసేది లేదంటూ సర్కార్ ఉత్తర్వులు..ఆలస్యంగా వెలుగులోకి
హోంగార్డుల కుటుంబ సభ్యులకు నియామకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన హోంశాఖ… pic.twitter.com/W6ss01hzbG
— Pulse News (@PulseNewsTelugu) January 20, 2025