దొడ్డు వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధం.. రాష్ట్రానికి ఇబ్బందేంటి? : కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ఆ పార్టీ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని రాష్ట్ర సర్కార్ రైతులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. డిసెంబరు 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

‘సన్నవడ్లకే బోనస్ అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారు. చాలా తక్కువమంది రైతులే సన్నవడ్లు పండిస్తారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఈ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసింది.’ అని కిషన్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news