కోదండరామ్ నెంబర్ వన్ లుచ్చా.. ఎవరు పాట పడితే వాని పాట పాడుతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బక్క జడ్సన్. ఇప్పుడు ఉన్నవాళ్లు మేధావులు కాదు.. అంతా 420 గాళ్లు.. పైసల్ ఇస్తే రికార్డింగ్ డాన్సులు కూడా వేస్తారు. మీవి బిచ్చపు బ్రతుకులు.. కోదండరామ్ కొత్త కారు కొన్న అంటుండు.. అమరవీరులు ఎలా బ్రతుకుతున్నారో తెలుసా నీకు..? అని ప్రశ్నించారు.
అందెశ్రీకి ఒక శాలువ ఇస్తే చాలు.. మంచి పాటను కీరవాణికి ఇచ్చి ఖూనీ చేశారు. ఇవాళ తెలంగాణ మేధావులు అందరు ప్రీపెయిడ్ మేధావులు. ఇవాళ తెలంగాణ తల్లిని మారిస్తే మేధావులు ఎవరు నోరు మెదపక పోడానికి కారణం వాళ్ళ నోటికి వేసిన కరెన్సీ.. వాళ్ళ ముడ్డి కింద వేసిన కరెన్సీ మెత్తాలే కారణం అని బక్క జడ్సన్ వ్యాఖ్యానించారు. బక్క జడ్సన్ వ్యాఖ్యలపై కోదండరామ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరీ.